‘పాలమూరు’ పంపులను ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ పంపులను ప్రారంభించాలి

Aug 8 2026 12:47 AM | Updated on Aug 8 2026 12:47 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా.. కేఎల్‌ఐ రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల చే యకుండా కాంగ్రెస్‌ ప్రభు త్వం మొద్దునిద్రపోతోందని మాజీ మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌ శుక్రవారం ప్రకటనలో మండిపడ్డారు. తక్షణమే కేఎల్‌ఐ మోటార్లు, పాలమూరు ప్రాజె క్టు నార్లాపూర్‌ పంపులను ఆన్‌ చేసి, నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్ల కింద ఉన్న ఆయకట్టు కు సా గునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు అందుబాటులో ఉన్న నీటిని విని యోగించుకోకుండా ఏపీకి తెలంగాణ నీళ్లను ధా రాదత్తం చేయడమే అవుతుందని విమర్శించా రు. చంద్రబాబు కింద పనిచేసిన ఆదిత్యనాథ్‌ దాస్‌ను సలహాదారుగా ని యమించుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈనెల 11వరకు డెడ్‌లైన్‌ విధిస్తున్నామని అప్పటిలోగా ప్రారంభించకుంటే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

బైక్‌ను ఢీకొన్న బొలెరో

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మృతి

మాగనూర్‌: వెనకనుంచి బైక్‌ను బొలెరో ఢీకొన్న ఘ టనలో శుక్రవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు న ర్సింహరెడ్డి(60) మృతి చెందాడు.నర్సింహరెడ్డి బైక్‌పై తహసీల్దార్‌ కార్యాలయం వై పు నుంచి వస్తుండగా వెనకనుంచి బొలెరో బైక్‌ ను బలంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరోను అక్కడ వదిలేసి డ్రైవర్‌ పారిపోయాడు. మృతిదేహాన్ని మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బొలెరోను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

తరగతి గదిలోకి పాము

మక్తల్‌: నారాయణపేట మండలం ఏక్లాస్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో పాము కాటుతో ఓ విద్యార్థి మృతి చెంది 24 గంటలు కూడా గడవకముందే శుక్రవారం మక్తల్‌ మండలం కాట్రెవ్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో పాము కనిపించడం కలకలం రేపింది. తరగతి గదిలో పాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. అనంతరం ఉపాధ్యాయులకు సమాచారం అందించా రు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పాఠశాలకు చేరుకోగా ఓ యువకుడు పామును కర్రతో కొట్టి చంపేశాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. తరగతి గదుల్లో వరుసగా పాములు ప్రత్యక్ష మవుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement