భూత్పూర్: ట్రాక్టర్ అదు పుతప్పి బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కొత్త మొల్గర గ్రామానికి చెందిన సిద్ధాపురం మల్లయ్య(45) తన వ్యవసాయ పొ లాన్ని ట్రాక్టర్‌తో చదును చేసుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సర్పంచ్ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న భూత్పూర్ పోలీసు లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పతికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ దివ్య తెలిపారు.
ఎదురెదురుగా ఢీ.. వాహనదారుడి మృతి
అచ్చంపేట రూరల్: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంకిరోనిపల్లికి చెందిన రవీందర్ (43) గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై అచ్చంపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. అదే సమయంలో హాజీపూర్ నుంచి అచ్చంపేట వైపు బైక్‌పై వస్తున్న నరేష్ ఎదురుగా వస్తున్న రవీందర్ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో రవీందర్‌కు తీవ్ర గాయాలు కాగా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే తీవ్ర గాయాలైన రవీందర్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ అంబులెన్సులో తరలిస్తుండగా అంబులెన్సును అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
హత్య కేసులో
ముగ్గురికి జీవిత ఖైదు
మహబూబ్‌నగర్ క్రైం: హత్య చేసిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు.. మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 జనవరి 29న కోటకదిర గ్రామానికి చెందిన మేకల నాగమ్మ అనే మ హిళ చేతబడి చేస్తుందనే నెపంతో అదే గ్రామానికి చెందిన సత్తయ్య, చంద్రమ్మ, నర్సమ్మ కర్రలతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం విచారణకు రాగా జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత నేరస్తులకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసులో శిక్ష పడేలా కృషి చేసిన రూరల్ పోలీసులను ఎస్పీ జానకి అభినందించారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
కోస్గి రూరల్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరధిలోని కడంపల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి నాగని బుగ్గప్ప(50) పొలంలో ఏర్పాటు చేసుకున్న ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దగ్గరే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద సరిచేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై అక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, కూమారుడు ఉన్నారు.
పరిసరాలు శుభ్రతతో
సీజనల్ వ్యాధుల కట్టడి
పాలమూరు: సీజనల్ వ్యాధులు కట్టడి చేయాలంటే ప్రతి ఇళ్లు పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఫ్రైడే–డ్రైడే సందర్భంగా శుక్రవారం నగరంలోని దొడ్డలోనిపల్లి, కోయనగర్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. గ్రామాల్లో పలు రకాల ఇళ్లను పరిశీలించి నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో డీఎంహెచ్‌వో బాలింతలు, గర్భిణీలకు అవగాహన కల్పించారు. నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారం అని తెలిపారు. డాక్టర్ నరేష్ చంద్ర, సిబ్బంది సుభాష్ చంద్ర, అశోక్‌రాజు, చక్రపాణి పాల్గొన్నారు.
● జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట డీఎంహెచ్‌ఓతో పాటు ప్రోగ్రామ్ అధికారులకు, మాస్ మీడియా అధికారులకు క్లినికల్ స్థాపన యాక్ట్ పూర్తి ఆన్‌లైన్ ద్వారా అమ లు చేసే విధానంపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లినికల్ స్థాపన యాక్ట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమణ హాజరై శిక్షణ ఇచ్చారు.కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓలు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ కృష్ణ, డాక్టర్ జయ చంద్రమోహన్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శివ కాంత్, రాజగోపాలచారి, సునీల్ పాల్గొన్నారు.


