జైలు స్నేహితులు.. సీరియల్‌ దొంగలు | - | Sakshi
Sakshi News home page

జైలు స్నేహితులు.. సీరియల్‌ దొంగలు

Aug 8 2026 12:47 AM | Updated on Aug 8 2026 12:47 AM

వరుస చోరీలు చేస్తూ

రోడ్లపై జీవనం

ముఠాను అరెస్టు చేసిన కోయిలకొండ పోలీసులు

మహబూబ్‌నగర్‌ క్రైం: ఓ ఇంట్లో చోరీ చేసిన ముగ్గుర్తిఓ కూడిన కరుడుగట్టిన సీరియల్‌ దొంగల ము ఠాను కోయిలకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌ఐ నాగరాజు వివరాలు వెల్లడించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దామయాపల్లికి చెందిన వెంకటేశ్వరమ్మ ఇంట్లో జూలై 23న ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.15వేల నగదు, 25తులాల వెండి చోరీ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భా గంగా శుక్రవారం ఉదయం రాంపూర్‌ గేట్‌ వద్ద ము గ్గురు అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం వస్తే ఘటన స్థలానికి చేరుకొని అక్కడి నుంచి స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేయగా దొంగతనం చేసినట్లు తేలిందన్నారు. పట్టుబడిన దొంగలలో ఏ–1 మనికొండకు చెందిన ఈర్ల రాములు, ఏ–2 నాగర్‌కర్నూల్‌కు చెందిన ఉంద్యాల రవీందర్‌రెడ్డి, ఏ–3 మరికల్‌ మండలం తీలేరుకు చెందిన చాకలి చంద్రయ్యగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరినుంచి 25తులాల వెండి, రెండు మాసాల బంగారం చెవి కమ్మలు రికవరీ చేసినట్లు తెలిపారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

జైలులో స్నేహితులు అయ్యారు

అయితే వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు దొంగతనం కేసులో జిల్లా జైలుకు వెళ్లిన క్రమంలో అక్కడ పరిచయయ్యారు. ఆ తర్వాత ముగ్గురు స్నేి హతులయ్యారు. బయటకు వచ్చి ముగ్గురు కలిసి మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఇటీ వల కర్ణాటకలో ఒక బైక్‌ చోరీ చేసి అదే బైక్‌పై తిరుగుతున్నారు. ఇటీవల కొత్తకోట వద్ద ఒక ఆలయంలో రూ.70వేలు ఎత్తుకెళ్లారు. ఈ ముఠాపై రేవల్లి, షాద్‌నగర్‌, గద్వాల పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. దీంట్లో రవీందర్‌రెడ్డికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరిగా పెరిగాడు. కనీసం ఆధార్‌కార్డు కూడా లేదు. దీనికితోడు ఈ ముగ్గురు కనీసం సెల్‌ఫోన్‌ కూడా వాడరు. వెళ్లిన చోట దొంగ తనాలు చేస్తారు..వచ్చిన డబ్బులు సమానంగా పంచుకొని జల్సాలు చేస్తారు. రోడ్లపై పడుకుంటూ.. పలు గ్రామాలు, పట్టణాలు సంచారం చేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement