స్టేషన్ మహబూబ్‌నగర్: ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించేదిశగా కృషి చేస్తామ ని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. జిల్లా కేంద్రం ద్వారకామయి బాబా మందిరం హాల్‌లో శుక్రవారం జిల్లా ధూప, దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపేంద్రశర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అర్చకుల సంక్షేమమే ధ్యే యంగా సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పనిచేస్తున్నారన్నారు. ధూప, దీప నైవేద్య దేవాలయాలను గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌గా ప్రకటించి అర్చకులను ఉద్యోగులుగా ప్రకటించే వి ధంగా అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. తె లంగాణ ధూప, దీప నైవేద్య అ ర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌శర్మ మాట్లాడుతూ ధూప, దీప నైవేద్య అర్చకుల ఉద్యోగ భద్రతే లక్ష్యంగా సంక్షేమ సంఘం ఆవిర్భవించిందన్నారు. సంక్షేమ సంఘా న్ని జిల్లాలో బలోపేతం చేయాలని కోరారు. ధూప, దీప నైవేద్య అర్చకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామన్నారు. అనంతరం ధూప, దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా కె. రాజుకుమార్, ఉపాధ్యక్షులుగా రవిశంకర్, రాధా కాంత్, ప్రధాన కార్యదర్శిగా ఎం.వంశీతేజ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాధాకృష్ణలను ఎన్నుకొని ని యామకపత్రాలు అందజేశారు.సమావేశంలో తెలంగాణ ధూప, దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్‌శాస్త్రి, రాష్ట్ర కోశాధికారి గాండ్ల రవికుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు తిరునగరి వెంటాద్రిస్వామి పాల్గొన్నారు.


