ఆపరేటర్ల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు సైతం ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు.
అన్యాయం చేయొద్దు
ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆపరేటర్లకు అన్యాయం చేయవద్దు. మా ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్యాయంగా తొలిగించి కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మొదట 300 మందిని తొలిగిస్తామని చెప్పి ఇప్పుడు అందరినీ తొలిగించే కుట్ర చేస్తుంది. వెంటనే తమకు పెండింగ్‌లో ఉన్న 15 నెలల వేతనాలు ఇవ్వాలి.
– రాంబాబు, భూ భారతి ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్
●


