కన్హాశాంతి వనంలో నిర్వహించే నేషనల్ సెమినార్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ రమేష్‌బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటిరోజు శాంతివనంలో ప్రారంభోత్సవం జరుగుతుందని, అందుకు మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ వస్తున్నారని, ఆయనతోపాటు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. రెండోరోజు పీయూలో నిర్వహించే పలు సెషన్స్‌లో యూనివర్సిటీల వీసీలు పాల్గొంటారని చెప్పారు. అదేరోజు ముగింపు కార్యక్రమానికి సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు హాజరవుతారన్నారు. సమావేశంలో కన్వీనర్లు మధుసూదన్‌రెడ్డి, ప్రవీణ, కుమారస్వామి, నూర్జహాన్ పాల్గొన్నారు.


