భూ భారతి ఆపరేటర్లకు మంగళం? | - | Sakshi
Sakshi News home page

భూ భారతి ఆపరేటర్లకు మంగళం?

Aug 6 2026 12:57 AM | Updated on Aug 6 2026 12:57 AM

నాగర్‌కర్నూల్‌/ జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఉద్వాసన పలకనుందా.. వారి స్థానంలో జూనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నియమించనున్నారా.. అన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననే అనిపిస్తున్నాయి. బుధవారం ఏకంగా కలెక్టరేట్లలో జిల్లాలోని జూనియర్‌ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్‌ విధానంపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌లో స్వయంగా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వగా.. ఇతర అధికారులు రిజిస్ట్రేషన్‌ చేసే విధానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్ల స్థానంలో వీరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 632 మంది..

గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకువచ్చి తహసీల్దార్‌ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్‌ చేయాలని 2018లో నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ ఆపరేటర్లుగా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ–సెన్‌ట్రిక్‌ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకోగా.. వీరిని ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్‌ మధ్యలో రెన్యువల్‌ చేసేవారు. ముందుగా రూ.11 వేల వేతనం ఇవ్వగా ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో చివర్లో నెలవారి వేతనం రూ.21,500 పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్‌ కింద తీసుకొని.. నెలకు రూ.21,500 వేతనం ఇస్తున్నారు. అయితే ఇది నెలవారిగా ఇవ్వకుండా మూ డు, ఆరునెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు.

రెండు రోజులుగా ఆందోళన

భూ భారతి ఆపరేటర్ల స్థానంలో జూనియర్‌ అసిస్టెంట్లను నియమిస్తున్నారని అనుమానంతో గత రెండు రోజుల నుంచి ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం రాష్ట్రంలోని ఆపరేటర్లందరూ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్లి నిరసన చేపట్టి తమగోడు వినిపించారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు వీహెచ్‌, జగ్గారెడ్డిని సైతం కలిసి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని విన్నవించారు.

వీరి స్థానంలో జూనియర్‌ అసిస్టెంట్ల నియామకం

ఇప్పటికే కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ

ఆందోళనలో ఔట్‌సోర్సింగ్‌ ఆపరేటర్లు.. 15 నెలల వేతనాలు పెండింగ్‌

రెండు రోజులుగా నిరసన

చేపడుతున్నా స్పందించని ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement