కాంగ్రెస్‌ వైఫల్యంతో పేదలకు చదువు దూరం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వైఫల్యంతో పేదలకు చదువు దూరం

Aug 2 2026 1:40 AM | Updated on Aug 2 2026 1:40 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థులను సీఎం

కించపరచడం సరికాదు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేవైఎం ధర్నా.. చెదరగొట్టిన పోలీసులు

పాలమూరు: రాష్ట్ర విద్యార్థుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి చులకన భావంతో మాట్లాడిన అంశంపై నిరసన తెలుపుతుంటే లాఠీచార్జీ చేయించడం దుర్మర్గమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పేద విద్యార్థులకు ఫీజుల బకాయిలను చెల్లించకపోవడం వల్ల వారి చదువు లు ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. సీఎం విద్యశాఖ తన దగ్గరే పెట్టుకొని రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్య అందకుండా దూరం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం ఆయన తప్పులును కప్పిపుచ్చుకోవడానికి ఇంజనీరింగ్‌ విద్యార్థులకు దరఖాస్తు రాయడానికి రాదని చెప్పి వారిని కించపరుస్తున్నారన్నారు. తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కొంత సమయం వ్యక్తిగత పూచీకతపై వదిలిపెట్టారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌, నేతలు సుబ్రహ్మణ్యం, మహేష్‌, లక్ష్మీనారాయణ, సందీప్‌, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement