మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి హుండీ ద్వారా రూ. 50,22,837 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించా రు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీ పర్యవేక్షణ అధికారిగా నిత్యానందచారి వ్యవహరించారు. ఎస్‌బీఐ దేవరకద్ర శాఖ, మహబూబ్‌నగర్ సత్యసాయి సేవా సమితి సభ్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొని హుండీ నగదు లెక్కింపును పారదర్శకంగా పూర్తి చేశారు. భక్తులు సమర్పించిన కానుకలతో దేవస్థానానికి రూ.50.22 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.


