అందరి మేలు కాంక్షించడమే నిజమైన ధర్మం | - | Sakshi
Sakshi News home page

అందరి మేలు కాంక్షించడమే నిజమైన ధర్మం

Jul 31 2026 12:45 AM | Updated on Jul 31 2026 12:45 AM

కల్వకుర్తి రూరల్‌: సమాజంలోని అందరికీ మేలు జరగాలని కోరుకోవడమే నిజమైన ధర్మమని వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు సిద్దా సూర్యప్రకాశరావు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో చేస్తున్న యాగంతో అందరికీ మేలు చేకూరుతుందన్నారు. ప్రస్తుతం సమాజంలో స్వార్థం పెరిగి, దైవభావం తగ్గిందన్నారు. దైవంపై భక్తి పెంచుకోవడంతో పాటు సమాజానికి.. లోక కల్యాణానికి పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు హోమాలు, యాగాలు సంస్కృతిని కాపాడుతున్నాయని అన్నారు. కార్యదర్శి దర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాజ హితమే మతమని, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడం ఎంతో మంచి విషయమన్నారు. సామా జిక సేవలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వాసవీ క్లబ్‌ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. వా సవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సెక్రెటరీ సర్వీసెస్‌ జూ లూరు రమేష్‌ బాబు మాట్లాడుతూ..16 రో జులపాటు నిర్వహిస్తు న్న విశ్వశాంతి మహాయాగంతో ప్రజలందరూ సుఖ సంతోషాల తో జీవించాలని ఆకాంక్షించారు. విశ్వశాంతి మహాయాగంతో ఆధ్యాత్మిక వైభవం ఏర్పడిందన్నారు. కాగా, శ్రీలక్ష్మీ హోమం, దేవసూక్త హోమం, శ్రీలక్ష్మీ నారాయణ సుదర్శన హోమంతో పాటు సామూహిక కుంకుమార్చనలను భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. మున్సిపల్‌ చైర్మన్‌ బృంగి రత్నమాల ఆనందకుమార్‌ దంపతులు హోమం చేశారు. భక్తులందరికీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ప్రవచనాలు చెప్పారు. క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ వి 108 ఏ గవర్నర్‌ కల్మిచర్ల రమేశ్‌, ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కల్వ హరికృష్ణ, సెక్రటరీ చంద్రశేఖర్‌, కోశాధికారి చిదిరే శ్రీనివాస్‌, డిప్యూటీ గవర్నర్‌ ప్రవీణ్‌, మాజీ గవర్నర్‌ మేడిశెట్టి రామకృష్ణ, గుగ్గిల శంకర్‌, కల్మిచర్ల గోపాల్‌, చిగుళ్లపల్లి శ్రీధర్‌, జూలూరు సత్యం, వాసవీ క్లబ్‌ కల్వకుర్తి అధ్యక్షుడు బాదం హరీష్‌, సాయిలక్ష్మి, కార్యదర్శులు గోవిందు సంతోష్‌, గోవిందు, మౌనిక, జూలూరు ప్రకాష్‌, పోల సురేందర్‌, వాసా శేఖర్‌, సతీష్‌, మురళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement