రాజోళిలో రాయదుర్గం వాసి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రాజోళిలో రాయదుర్గం వాసి ఆత్మహత్య

Jul 21 2026 1:36 AM | Updated on Jul 21 2026 1:36 AM

రాజోళి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాయదుర్గానికి చెందిన చేనేత కార్మికుడు మండల కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివా రం రాత్రి జరిగింది. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. రాయదుర్గం పట్ట నానికి చెందిన సత్యనారాయణ(45) పదేళ్ల క్రితం రాజోళిలో చేనేత పనులు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రాజోళిలో పాత స్నేహితుడైన గోపి ఇంటికి వ చ్చాడు. రాత్రి భోజనం చేశాక వరండాలో పడుకున్నాడు. సోమ వారం ఉదయం 5 గంటలకు గోపి నిద్రలేచి చూడగా అప్పటికే వరండాలోని రేకులకు ఉన్న ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని విగతజీవిగా ఉన్నాడు. సమాచారం తెలసుకు న్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అలంపూర్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ప్రేమ వ్యవహారం..

బాలిక ఆత్మహత్య

నవాబుపేట: మైనర్‌ బాలిక ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని యన్మన్‌గండ్లకు చెందిన బాలిక గ తంలో అదే గ్రామానికి చెందిన కోస్గి సత్య య్య అనే వ్యక్తి ప్రేమించి ఇంటి నుంచి తీసు కెళ్లిపోయాడు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయ గా వారు బాలికను కనిపెట్టి అప్పగించారు. అనంతరం నిందితుడిపై కేసు నమో దు చేసి జైలుకు పంపించారు. కాగా ఇటీవల అతడు బెయిల్‌పై బయటికి వచ్చి బాలిక ఇంటి చుట్టు తిరిగేవాడు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో బాలికను మళ్లీ కలువకుండా నిర్ణయం తీసుకున్నారు. అయితే సదరు బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు.

జాలరి మృతదేహం లభ్యం

ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి ఊ ర చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన జాల రి ఆవుల తిరుపతయ్య (55) శవం సోమవా రం ఉదయం నీటిలో తేలడంతో బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ పుట్ట మహేష్‌ తెలిపారు.

పిల్లలతో కలిసి తల్లి

అదృశ్యం

బల్మూర్‌: భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి నాలుగు నెలల క్రితం అదృశ్యం కాగా.. సోమవారం బల్మూర్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. పూర్తి వివరాలు.. మండలంలోని జిన్‌కుంటకు చెందిన మల్లీశ్వరికి గోపాల్‌పేటకు చెందిన చెన్నగల్ల శివతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. మల్లీశ్వరి ఆరు నెలల క్రితం ఇద్ద రు పిల్లలు మనోజ్ఞ, నంద కిషోర్‌తో కలిసి జిన్‌కుంటకు వచ్చింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం మల్లీశ్వరి తన ఇద్దరు పిల్లలను తీసుకోని తల్లిగారి ఇంటి నుంచి వెళ్లి నేటికీ తిరిగి రాలేదు. దీంతో భర్త, పుట్టింటి వారు ఎక్కడ వెతికినా వారి ఆచూకీ లభించలేదు. మ ల్లీశ్వరి కుటుంబ సభ్యులు ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు.

పోలీసుల అదుపులో

అర్చకుడు?

అలంపూర్‌: అలంపూర్‌ ఆలయాల్లో విధులు నిర్వహించే ఓ అర్చకుడిని హైదరాబాద్‌పోలీసులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ రామకృష్ణను సంప్రదించగా.. నాగోల్‌కు చెందిన పోలీసులు సమాచారం ఇచ్చి తీసుకెళ్లారన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారన్నారు. నోటీసులు ఇచ్చి తిరిగి పంపించే అవకాశం ఉండవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement