చిన్నచింతకుంట/ దేవరకద్ర రూరల్: విద్యార్థుల ఆరోగ్యంపై రాజీ పడొద్దని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ కుష్బూగుప్తా అన్నారు. శుక్రవారం ఆమె చిన్నచింతకుంటలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి.. ఆర్‌బీఎస్‌కే కింద వైద్య బృందం ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. ఎంత మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు.. ఎంత మందితో రక్తనమూనాలు సేకరించారు. ఆరోగ్య సమస్యలు ఏమిటి.. ఎలాంటి చికిత్స అందిస్తున్నారని వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీబీవీని సందర్శించి.. భోజనం నాణ్యత, వసతి, తాగునీరు, పరిశుభ్రత, విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలోని వరండాలో కింద కూర్చుని ఆమె విద్యార్థులతో ముచ్చటిస్తూ భోజనం చేశారు. అలాగే కౌకుంట్ల మండలంలోని పుట్టపల్లి, పేరూర్ గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ కేంద్రం, పశువైద్య కేంద్రాలను సందర్శించి సేవల నిర్వహణ, పరిశుభ్రత, మెనూ అమలును పరిశీలించారు.
కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశం
చిన్నచింతకుంట, కౌకుంట్లలో ఆకస్మిక పర్యటన
విద్యార్థులతో కలిసి
సహపంక్తి భోజనం


