మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నీట్–2026 ఫలితా ల్లో జిల్లా కేంద్రంలోని రిషి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. చైర్‌పర్సన్ చంద్రకళావెంకట్, డైరెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థులు నుజత్ 555, మనస్విత 545, నందినిరెడ్డి 543, ప్రియాంక 540, భావన 529, సాయి శ్రీ 515, మలిహ కహానియా 511, హప్స మెహిన్ 511 మార్కులు సాధించి జాతీయస్థాయిలో సత్తాచాటారని తెలిపారు. తమ విద్యార్థులు 125 సీట్లు సాధించే అవకాశం ఉందని, ఇంతటి విజయం సాధించేందుకు సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డీన్ భూపాల్‌రెడ్డి, కల్యాన్‌బాబు, ప్రిన్సిపాల్ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


