ఈహెచ్‌ఎస్‌ అమలుపై హర్షం | - | Sakshi
Sakshi News home page

ఈహెచ్‌ఎస్‌ అమలుపై హర్షం

Jul 18 2026 9:27 AM | Updated on Jul 18 2026 9:27 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, కార్యదర్శి చంద్రనాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు హెల్త్‌ కార్డులు విడుదల కావడంతో ఆయా వర్గాల వారికి మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరూ అధికారిక ఆన్‌లైన్‌ పోర్టల్‌లో తమ ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement