ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

మన్ననూర్‌: కేంద్ర పర్యాటక శాఖ, రాష్ట్ర అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఎకో టూరిజం మరింత అభివృద్ధి పర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఎ) సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని సంయుక్త పు నరావాస ఐదు గ్రామాల అధ్యక్షుడు (సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాల, కొల్లం, వటువర్లపల్లి) సీఎ సాయిబాబు తె లిపారు. రెండువారాల కిందట తెలంగాణ ప్రాంతం నుంచి సాయిబాబు, సంతోష్‌ మధ్యప్రదేశ్‌లోని మన్న టైగర్‌, ఈకో టూరిజం ప్రాజెక్టుకు అటవీశాఖ తరఫున వెళ్లారు. ఆదివారం ఫోన్‌ ద్వారా మధ్యప్రదేశ్‌ నుంచి స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్‌టీసీఎ బృందం సభ్యుల సమక్షంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధి సభ్యులతోపాటు తెలంగాణ తరఫు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు, ఈకో క్రాఫ్ట్‌ కన్జర్వేషన్‌ టూరిజం హబ్‌, టైగర్‌ సఫారీ తదితర అంశాలపై సాయిబాబు పవర్‌ ఫ్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు తరఫున ఇచ్చిన పవర్‌ ఫ్రజెంటేషన్‌ మొదటి స్థానంలో నిలువడం గర్వంగా ఉందన్నారు. అమ్రాబాద్‌ ఈకో టూరిజం అభివృద్ధితో ప్రత్యేకించి చెంచు గిరిజనులకు ఉపాధి అవకాశాలు, స్థిరమైన ఆదాయ వనరులు, స్థానిక కళలు, సాంస్కృతిక ప్రోత్సాహం, ప్రకృతి సంరక్షణతో కూడిన అభివృద్ధి వంటివి ఈ ప్రాంతంలో అందుబాటులోకి రానున్నాయని ఎన్‌టీసీఏ సభ్యులు తెలియజేశారు. అటవీశాఖ తరఫున ఇలాంటి అవకాశం కల్పించిన డీఎఫ్‌ఓ రేవంత్‌ చంద్ర, ఎఫ్‌డీఓలు, ఎఫ్‌ఆర్‌ఓలు, సంబంధిత అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement