మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆరునుంచి తొమ్మిది గంటల వరకు జిల్లా ప్రధాన స్టేడియం కమాన్ వద్ద నిర్వహించిన ‘హ్యాపీ సండే’ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా వీరి మ్యాజిక్ షో, మిమిక్రీ, కరాటే, యోగాసనాలు, సంప్రదాయ నృత్యాలను ఆహూతులు ఉత్సాహంగా తిలకించారు. అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వారు తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలు, ఇతర వస్తువులను ప్రదర్శించారు.


