ఇంటర్‌ ఫలితాల్లో ‘వాగ్దేవి’ సత్తా | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో ‘వాగ్దేవి’ సత్తా

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవీ జూనియర్‌ కళాశాల విద్యార్థు లు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు కళాశల విద్యార్థులు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో భరత్‌కృష్ణ 468, సంజన 467, మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం బైపీసీలో సిద్రఫాతిమా 438, కాన్స తబస్సుమ్‌ 437 మార్కులు సాధించారు. రెండో సంవత్సరం ఎంపీసీలో ఆస్పియా తబస్సుమ్‌ 994, వైశాలి 993, అమీనా మరియమ్‌ 991, కౌశిక్‌ 991 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంతటి ఘన విజయాన్ని సాధించేందుకు సహకరించిన అధ్యాపకులను అభినందించారు. కళాశాలలో ఇన్నోవేటివ్‌ సైంటిఫిక్‌ మెథడ్‌ ద్వారా నాణ్యమైన బోధన అందించడంతో విద్యార్థులు మంచి విజయాన్ని సాధించారన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని మార్కులు సాధించాలని సూచించారు.

‘రిషి’ విద్యార్థుల ప్రభంజనం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని రిషి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ మేరకు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో వినయ్‌కుమార్‌గౌడ్‌ 468, వేణుమాధవ్‌రెడ్డి, అంకిత్‌రెడ్డి, మాధురి కార్తీక్‌ రెడ్డి, సృజన 467 మార్కులు సాధించారు. బైపీసీ మొదటి సంవత్సరంలో అక్షిత, తానియా మహమూద్‌ 438 మార్కులు, శ్రావణి, భవిత్‌, సౌమ్య, సురేంద్రచక్రవర్తి, అక్షిత, ఆయేషాజు వా, అఖిల, అశ్లేషయాదవ్‌, మౌనిక, రిషిత, నాగసాయివైష్ణవి, మైవిన్‌, మీనాక్షి సహ 14మంది 437 మార్కులు సాధించారు. రెండో సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఎంపీసీ విభాగంలో భావన 995, మహ్మద్‌ అశ్వక్‌అహ్మద్‌, సయ్యద్‌ బిస్బ ఉద్దీన్‌, శ్రీవిద్యకు 992 మార్కులు, కోటేశ్వర్‌ 990మార్కులు సాధించారు. బైపీసీ విభా గం రెండో సంవత్సరంలో అమూల్య, అఫ్సామొయిన్‌, గాయిత్రి 994 మార్కులు సాధించారు. ఫారియా, ఫాతిమా ఖదీర్‌, 993, నందినిరెడ్డి, వైశాలి 992, శ్రీనిధి 991, సృజన 990, సుమేరాబేగం 990 మార్కులు సాధించారు. ఈ మేరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల చైర్‌పర్సన్‌ చంద్రకళావెంకట్‌, వెంకటయ్య, డీన్‌ భూపాల్‌రెడ్డి, కల్యాణ్‌బాబు, ప్రిన్సిపాల్‌ రాఘవేంద్రరావు, వెంకటరత్నం, ప్రసన్నకుమారి పాల్గొన్నారు.

మరోసారి ‘ప్రతిభ’ విజయఢంకా

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని ప్రతిభ జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఈ మేరకు మొదటి సంవత్సరం ఎంపీసీలో రిషిక, రిషిత, చందన, ప్రసన్నతార, నందకిషోర్‌, అపూర్వరాజ్‌, జశ్వంత్‌, రిత్విక్‌కుమార్‌, హృషికేష్‌ 468 మార్కులు, షరద్యుతి 467, సాయినాథ్‌ 467, అభినయ 467 మార్కులు సాధించారు. బైపీసీ మొదటి సంవత్సరంలో మానస 438, నవ్య 437, రుమన ఫిర్దోస్‌ 437, హానీయా కుర్రతులైన్‌ 437, ఇక్రరహ్మత్‌ 437, సాహితి 436, వీణ 436, షఫీన్‌ ఫాతిమా 435, ఎంపీసీ రెండో సంవత్సరంలో వైష్ణవి 994, వై.వైష్ణవి 993, హర్షిత 993, రాఘవి 993, శ్రీవల్లి 992, త్రిష 991, సాయిశ్రీరెడ్డి 991, శివానీ 991, నేహారెడ్డి 991, జవేరియాకుర్రతులైమ్‌ 990, శ్రీనితిన్‌ 990, అమూల్య 990, సిద్దార్థ 990, సాయిచరిత 990, నిఖిల్‌చారి 990, రాజేశ్వరీ 990, బైపీసీ రెండో సంవత్సరంలో కె.వైష్ణవి 992, సుప్రజ 991, మార్కులు సాధించారు. ఈ మేరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement