ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఇటీవల ఆయన మేనకోడలు సునీత అనారోగ్యంతో మృతిచెందగా.. ఆమె అస్థికలకు పుష్కరఘాట్ పురోహితుడు అనిల్‌శర్మ ఆధ్వర్యంలో అపరకర్మ పూజలు నిర్వహించారు. అనంత రం కుటుంబ సభ్యులతో కలిసి అస్థికలను శాస్త్రోక్తంగా కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. అంతకు ముందు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ స్థానిక నాయకులతో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. వారి వెంట డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్‌కుమార్, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, రుక్మాందర్‌రెడ్డి ఉన్నారు.
హజ్‌యాత్రికులకు డిజిటల్ హజ్ ట్రైనింగ్ క్యాంప్
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని మెట్రో ప్యాలెస్ కన్వెన్షన్‌లో ఆదివారం ఈ ఏడాది హజ్‌యాత్రకు వెళ్తున్న యాత్రికులకు ప్రత్యేక డిజిటల్ హజ్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ డిజిటల్ హజ్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఢిల్లీకి చెందిన చీఫ్ ట్రైనర్ ఎండీ మోనిస్‌ఖాన్ యాత్రీకులకు డిజిటల్ హజ్ ట్రైనింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా హజ్‌యాత్ర విశేషాల గురించి వివరించారు. అనంతరం జిల్లా హజ్ సొసైటీ ప్రతినిధులు హజ్‌యాత్రీకులకు హెల్త్‌బుక్‌లెట్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మహెమూద్‌అలీ, ఎండీ.మెరాజుద్దీన్, రవూఫ్‌పాషా, సత్తార్, మహ్మద్ యూసుఫ్, ఖాజా నిజాముద్దీన్, సయ్యద్ నిజాముద్దీన్, ఫైజొద్దీన్, అయూబ్‌పాషా, ఎండి.రఫీక్, కలీం, ఇసాక్, రఫీక్ ఉర్ రహెమాన్, అర్షద్‌అ లీ, ఎండీ.సిరాజ్, మూసా తదితరులు పాల్గొన్నారు.


