ధాన్యం కొను‘గోల్‌మాల్’పై విచారణ
● అక్రమంగా పంపిన ధాన్యానికి రూ.14.90 లక్షలు జమ
● ట్రక్ ీషీట్లు ఎత్తుకెళ్లిన జగదీశ్‌పై
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
వీపనగండ్ల: నిబంధనలకు విరుద్ధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి అనధికార రైస్‌మిల్లుకు పంపిన 624 క్వింటాళ్ల వరిధాన్యానికి ఆగమేఘాలపై రూ.14, 90, 735లను అధికారులు జమ చేసిన ఘటన వనపర్తి జిల్లా, వీపనగండ్ల మండలం, గోపల్‌దిన్నెలోని ఐకేపీ సెంటర్‌లో చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలపై మంగళవారం గ్రా మంలో అడిషనల్ డీఆర్డీఓ సరోజ, డీపీఎం ప్రభాకర్ జరిపిన వి చారణలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. గ్రామంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసేందుకు రూ.18వేల జీతంతో అదే గ్రామానికి చెందిన జగదీశ్ అనే ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని జిల్లా అధికారులు సూచించినా.. ఇదే జిల్లాలోని రైస్ మిల్లర్‌లకు పంపించేవారు. కాని అనధికార ఆన్‌లైన్ ఉద్యోగి మహిళా సంఘం సభ్యులకు తెలియకుండా రెండు ట్రక్ సీట్లను తీసుకొని ఎలాంటి సంబంధంలేని గద్వాల జిల్లాలోని ఎంఎస్‌ఇమాన్ రైస్ మిల్లుకు పంపించగా.. వారం రోజుల్లోనే రంగవరం గ్రామానికి చెందిన చల్మారెడ్డి అనే రైతు ఖాతాలో రూ.5, 25, 580, గోపల్‌దిన్నెకు చెందిన కావలి నాగేంద్రం ఖాతాలో రూ.2, 29, 344, పి శ్రీనివాసులు ఖాతాలో రూ.లక్షా38, 562, ఆన్‌లైన్ ఉద్యోగి కావలి జగదీశ్ ఖాతాలో రూ.5, 65, 715, ఆబోతు దేవయ్య ఖాతాలో రూ.31, 534 వారం రోజుల్లోనే జమ చేసినట్లు వెల్లడైంది. 2064 ట్రక్‌సీటు నెంబర్ ద్వారా 770 బ్యాగులు, 2058 నెంబర్ ద్వారా 790 బ్యాగులు మొత్తం 1, 560 బ్యాగులు, 624 క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించినట్లు చూపించిన అధికారులు విచారణలో ఇట్టి ధాన్యాన్ని గ్రామంలోని హమాలీలెవరూ తూకం వేయలేదని.. అసలు లారీయే గ్రామంలోకి రాలేద ని గన్నీ బ్యాగులను మహిళా సంఘ సభ్యులు ఇవ్వలేదని గద్వాలలోని రైస్‌మిల్లు వద్ద వేబీచ్ కాంట కాలేదని విచారణలో వెల్లడైంది. డబ్బులు మాత్రం రైతు ఖాతాలో జమకావడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఇమాన్ రైస్‌మిల్లు పేరు కనిపించడం వల్లే ధాన్యాన్ని అక్కడకు పంపించానని ఆపరేటర్ జగదీశ్ తెలియజేయగా.. తాము ధాన్యాన్ని విక్రయించడం వల్లే తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని రైతులు చల్మారెడ్డి, దేవయ్య అధికారులకు తెలియజేశారు. నిజమైన రైతులకు సకాలంలో డబ్బులు జమ చేయకుండా అక్రమంగా వెళ్లిన ధాన్యానికి డబ్బులు జమ చేసిన అంశంతోపాటు 5ఏళ్లుగా గ్రామంలో జరిపిన ధాన్యం కొనుగోళ్లపై కూడ పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సర్పంచ్ దొడ్ల కవిత, పలువురు రైతులు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ మహిళా సంఘ సభ్యులు తమకు తెలియకుండా ట్రక్ సీట్లను ఎత్తుకెళ్లిన విషయమై జగదీశ్‌పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.లక్షలు జ మ కావడంపై ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లకు కూడా ఈ విషయంలో సంబంధం ఉందని పూర్తి స్థాయిలో విచా రణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ ఏపీఎం రాంబాబు, డీఆర్‌పీ తిరుతప మ్మ, ఏపీఎం మద్దిలేటి, ఉపసర్పంచ్ వెంకటస్వామి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ బాల్‌రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.


