స్థానికం.. సంస్థాగతం!
పాలమూరులో కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం
3 జిల్లాల్లో ‘ఢీ’సీసీ..
ఈ ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్ 22న ఐదు జిల్లా లకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మె ల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్ కుమార్‌రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్‌నగర్‌లో సంజీవ్ ముదిరాజ్, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్‌రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు.
గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్‌కు షాకిచ్చారు. ఆగస్ట్ 3న బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన అదే నెల పదో తేదీన బీజేపీలో చేరారు. ● 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారనే ప్రచారం జరిగింది. బీఆర్‌ఎస్ సైతం తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్‌లో చేరారని.. అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరింది. విచారణ చేపట్టిన స్పీకర్ డిసెంబర్ 17న అనర్హత పిటిషన్‌ను కొట్టివేయడంతో ‘బండ్ల’కు ఊరట లభించినట్లయింది.
నా స్టయిలే వేరు..
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలని.. ఇంకా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలి పిస్తే సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమపై పీసీబీ చర్యలు తీసుకోకుంటే నేనే స్వయంగా ఓ ఫార్మా కంపెనీని తగలబెడతానని వీడియో రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది.
కాంగ్రెస్: పై‘చేయి’.. అయినా డీలా..
మూడు విడతలుగా డిసెంబర్ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది.
నిలబెట్టుకున్న హామీ.. మంత్రిగా వాకిటి
ముదిరాజ్‌లకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జూన్‌లో చేపట్టిన రెండో దశ మంత్రివర్గ విస్తరణలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించారు. జూన్ 11న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 16న రాష్ట్ర మత్స్య, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్‌ఎస్
గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ
‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక
ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్
వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం
పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్‌ఎస్
గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ
‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక
ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్
వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం
స్థానికం.. సంస్థాగతం!


