రేపు అయ్యప్పకొండపై మహాపూజ
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలో అయ్యప్పకొండపై 25వ తేదీన 28వ వార్షికోత్సవ అయ్యప్ప స్వామి మహాపూజ నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు భగవంతురావు వెల్లడించారు. మంగళవారం అయ్యప్పకొండపై ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు సుప్రభాతసేవ, గణపతి, నవగ్రహ హోమం, నిత్యాభిషేకం ఉంటుందని, అనంతరం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10 గంటలకు తూర్పు కమాన్ వద్దగల రామాల యం నుంచి కలశ, స్వామి వారి పల్లకీసేవ ప్రారంభమై పట్టణ ప్రధాన రహదారుల మీదుగా అయ్య ప్ప కొండ ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు.10 గంటలకు అష్టాభిషేకం ఉంటుందని, మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7.30 గంటలకు తిరుపతికి చెందిన వెంకటేశ్వర చంద్రమౌళి శర్మ, పాలమూరుగురుస్వాముల ఆధ్వర్యంలో ఏకశిల దివ్య పదునెట్టాంబడి పూజ, మహామంగళహారతి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మహాపడిపూజ కరపత్రాలను ఆవిష్కరించారు. సేవా సమాజం ప్రధాన కార్యదర్శి ముత్యం గురుస్వామి, పంబరాజు, ఎత్తెపు కేశవులు, హర్షవర్దన్‌రెడ్డి, ప్రసాద్, గణేష్, యాదయ్య పాల్గొన్నారు.


