అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం
వనపర్తి/ గద్వాల టౌన్/ అలంపూర్: అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం వంటి సంక్షేమ ఫలాలు అందించడంతోనే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అ న్నారు. పీఎం నరేంద్రమోదీ కలలుగన్న వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే దేశంలోని అన్నివ ర్గాల వారు ఆర్థిక సాధికారత సాధించాలని పే ర్కొన్నారు. మంగళవారం వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఆయన పర్యటించారు. ముందుగా వనపర్తి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లు, బాలభవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనను కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి తదితరులతో కలిసి తిలకించారు. అనంతరం కవులు, కళాకారులు, ఆయా శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గవర్నర్ స్పెషల్ సెక్రటరీ భవాని శంకర్‌తో కలిసి హాజరయ్యారు. క్షయరహిత సమాజ నిర్మాణం, బాల్యవివాహాల నిర్మూలన కోసం కవులు, కళాకారులు, రచయితల గళం ఎంతో కీలకమన్నారు. అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను అధికారులు గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
క్షయరహిత సమాజ నిర్మాణానికికృషిచేయాలి
చేనేత రంగానికి గుర్తింపు తెచ్చి..భావితరాలకు అందించాలి
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అలంపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు


