పగిలిన కిటికి అద్దాలు
దేవరకద్రలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో వందమంది విద్యార్థులున్నారు. వేడినీటి వసతి లేకపోవడంతో తెల్లవారుజాము నుంచే చలికి వణుకుతూ స్నానాలు చేస్తున్నారు. కొందరు ఆరు బయట కట్టెల పొయ్యిపై నీటిని వేడి చేసుకోవడం కనిపించింది. కిటికీలకు అద్దాలు సరిగ్గా లేకపోవడం, కొన్ని వెంటిలేటర్లకు అద్దాలు పగలిపోవడంతో రాత్రివేళ చలికి వణుకుతున్నట్లు విద్యార్థుల చెప్పారు. ఈ విషయంపై వార్డెన్ తురియానంద్‌ను వివరణ కోరగా గీజర్ కోసం, కిటికి అద్దాల కోసం అధికారులు వచ్చి పరిశీలించి ప్రతిపాదనలు చేశారని తెలిపారు.
పగిలిన కిటికి అద్దాలు


