సాహిత్యం ద్వారానే సమాజంలో మార్పు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సాహిత్యం ద్వారానే సమాజంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆర్జేడీ రాజేందర్‌సింగ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో గోవర్ధన్ రచించిన ఐదు శతకాలను ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పద్య రచనపై గోవర్ధన్ అభిరుచి చాలా ఉన్నతమైందని, ఇప్పటి వరకు 9 శతకాలు రచించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇవి సమాజంలో వ్యక్తులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని, ఇటువంటి చరనలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. భవిష్యత్‌లో గోవర్ధన్ కలం నుంచి మరిన్ని శతకాలు రావాలని ఆకాంక్షించారు. ఈమేరకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కవి కసిరెడ్డి వెంకటరెడ్డి పద్యం యొక్క ప్రధాన్యతను ఆయన వివరించారు. గోవర్ధన్ రచించిన బిజేపల్లి వెంకటేశ శతకం, పద్యోపహారం, ఈరా శతకం, కంద మకరందాలు, వాణి త్రిశతిలు ఉన్నాయి. వీటిలో దేవుళ్ల పేరుపై శతకాలు ఉన్న ఇందులో అంశాలు సమకాలిన సమాజిక అంశాలతో మిలితమై ఉంటాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ–1 బాలుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


