ఉత్సాహంగా టీ–20 క్రికెట్‌ లీగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా టీ–20 క్రికెట్‌ లీగ్‌

Dec 24 2025 5:43 AM | Updated on Dec 24 2025 5:43 AM

ఉత్సా

ఉత్సాహంగా టీ–20 క్రికెట్‌ లీగ్‌

పాలమూరు 111 పరుగుల భారీ విజయం

టీ–20 లీగ్‌లో ప్రతిభచాటాలి

రెండో రోజు మహబూబ్‌నగర్‌,

నారాయణపేట జట్ల విజయం

అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన శ్రీకాంత్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ క్రికెట్‌ మైదానంలో కాకా మెమోరియల్‌ తెలంగాణ ఇంటర్‌డిస్ట్రిక్ట్‌ టీ–20 లీగ్‌ ఉత్సాహంగా జరుగుతోంది. రెండోరోజు లీగ్‌ మ్యాచుల్లో మహబూబ్‌నగర్‌, నారాయణపేట జట్లు విజ యం సాధించాయి. క్రికెట్‌ మైదానంలో ఏర్పా టు చేసిన టర్ఫ్‌ పిచ్‌పై మొదటిసారిగా లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

కాకా వెంకటస్వామి మెమోరియల్‌ టీ–20 లీగ్‌లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌, ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి అన్నారు. రెండో రోజు మ్యాచ్‌లను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా క్రికెట్‌ మైదానాన్ని తీర్చిదిద్దిన క్యూరెటర్‌ సత్యనానారాయణ యాదవ్‌ను ఘనంగా సన్మానించి ఎండీసీఏ తరఫున రూ.25వేల నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ క్యూరెటర్‌ సత్యనారాయణయాదవ్‌ ఎంతో కష్టపడి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ క్రికెట్‌ మైదానాన్ని ఆధునీకరించినట్లు తెలిపారు. ఆయనను ఎండీసీఏ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్‌, వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్‌తోపాటు శివశంకర్‌, వజాహత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఆతిథ్య మహబూబ్‌నగర్‌ జట్టు 111 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జ ట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్‌ రాఫే, డేవిడ్‌ క్రిపాల్‌ 77 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. డేవిడ్‌ క్రిపాల్‌ 42 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 పరుగులు, అబ్దుల్‌ రాఫే 40 పరుగులు చేశారు. మొదటిడౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఎ.శ్రీకాంత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 38 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్స్‌లతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బ్యా టింగ్‌కు దిగిన వనపర్తి జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జట్టులో రాంచారి 31 పరుగులు చేశా రు. మహబూబ్‌నగర్‌ బౌలర్లు షాదాబ్‌ 2, యు వన్‌ 2 వికెట్లు తీశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎ.శ్రీకాంత్‌ (మహబూబ్‌నగర్‌) నిలిచాడు.

ఉత్సాహంగా టీ–20 క్రికెట్‌ లీగ్‌ 1
1/2

ఉత్సాహంగా టీ–20 క్రికెట్‌ లీగ్‌

ఉత్సాహంగా టీ–20 క్రికెట్‌ లీగ్‌ 2
2/2

ఉత్సాహంగా టీ–20 క్రికెట్‌ లీగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement