పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Dec 24 2025 5:43 AM | Updated on Dec 24 2025 5:43 AM

పీడీఎ

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

మద్దూరు: మండల పరిధిలోని దమగ్నాపూర్‌ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గ్రామా నికి చెందిన శశిధర్‌ పీడీఎస్‌ బియ్యాన్ని అక్ర మంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచారన్నా స మాచారం మేరకు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఆనంద్‌ దాడి చేసి 29 క్వింటా ళ్లు సీజ్‌ చేసి నాగిరెడ్డిపల్లిలోని డీలర్‌షాపుకు తరలించినట్లు తెలిపారు. అనంతరం శశిధర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

చోరీ కేసును

ఛేదించిన పోలీసులు

దామరగిద్ద: మండలంలోని మొగుల్‌మడ్క గ్రా మంలో ఐదు రోజుల క్రితం జరిగిన చోరీ కేసు ను పోలీసలు ఛేదించారు. బాధితుడు కొనాపురం వెంకటేశ్‌ ఇచ్చిప ఫిర్యాదు మేరకు దర్యా ప్తు చేపట్టిన పోలీసులు వేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితు లు కర్ణాటకలోని తిలార్కొట్‌ గ్రామానికి చెందిన కూరుకు నవీన్‌, బైరంకొండ శ్రీను, అలి యాస్‌ శ్రీనివాస్‌గా గుర్తించి వారిని పట్టుకొని మంగళవారం పోలీస్‌ స్టేషన్‌లో హాజరు పరిచారు. అలాగే చోరీకి గురైన 5 గ్రామాల బరువు గల రెండు బంగారు ఉంగరాలు, ఆరు మాసాల బ రువు గల చెవి కమ్మలు, 16 వెండి ఉంగరాలు, ఒక వెండి బ్రాస్‌లెట్‌, రూ.30 వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

రోడ్డు పనులు

అడ్డగించిన గ్రామస్తులు

మాగనూర్‌: భారీ వాహనాలతో ఇసుక తరలించడం వలన రోడ్డు ధ్వంసమవుతుందంటూ చిట్యాల గ్రామస్తులు మంగళవారం రోడ్డు పనులను అడ్డుకున్నారు. మండల పరిధిలోని మందిపల్లి పెద్దవాగు నుంచి మక్తల్‌కు చెందిన ఓ వ్యక్తి టీజీఎండీసీ ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు పొందారు. అయితే ఇసుక రవాణా కోసం కావాల్సిన రోడ్డు పనులను చేస్తుండగా మక్తల్‌ మండలం చిట్యాల గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక రవాణాను మాగనూర్‌ మండలం మీదుగా తరలించాలని డిమాండ్‌ చేశారు. ఇసుక లోడుతో భారీ వాహనాలు వెళ్లడం వలన రోడ్డు మొత్తం గుంతలుగా మారి అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకను తరలింపు మాగనూర్‌ మండలం మీదుగా చేయకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇద్దరికి జైలు శిక్ష

అమరచింత: ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన బోయ రాజు, మండ్ల పుట్టయ్యకు 18 నెలల జైళ్లు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. 2017 సంవత్సరంలో అమరచింత మండలం ధర్మాపురం సమీపంలో నిందుతులు ఇద్దరు టిప్పర్‌, ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడుపుతూ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఇద్దరి మృతికి కారకులయ్యారన్నారు. ఆ సమయంలో అమరచింత పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంగళవారం ఆత్మకూర్‌ సివిల్‌ కోర్టులో జడ్జి శిరీష విచారణ చేపట్టి నిందితులకు శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

వెండి ఆభరణాలు చోరీ

నాగర్‌కర్నూల్‌ క్రైం: 40 తులాల వెండి ఆభరణాలు చోరీ అయిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాలలో చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగమ్మ గొర్రెలను మేపేందుకు వెళ్లింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటికి వేసిన తాళా న్ని విరగ్గొట్టి బీరువాలో ఉన్న 40 తులాల వెండి కడియాలే ఎత్తుకెళ్లారు. ఈ నెల 21న ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం విరగ్గొట్టి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశా రు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చెరువులో వ్యక్తి

మృతదేహం లభ్యం

చిన్నంబావి: మండల పరిధిలోని బెక్కం గ్రామ పెద్ద చెరువులో వ్యక్తి మృతదేహం మంగళవా రం లభ్యమైంది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాలు.. పెంట్లవెళ్లి మండలం జటప్రోల్‌కు చెందిన నరసింహ్మ(70) ఈ నెల 15న కుమార్తె చిట్టెమ్మ ఇంటికి వెళ్లి వస్తానని మండలంలోని వెలగొండకు వచ్చాడు. తిరిగి జటప్రోల్‌కు వెళ్తా నని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకూ ఆ చూకీ తెలియకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కుమార్తె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గ్రామంలోని చెరువులో వ్యక్తి మృతదేహం తేలుతుందన్న స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టి మృతి చెందింది నరసింహ్మగా గుర్తించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత  
1
1/2

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

పీడీఎస్‌ బియ్యం పట్టివేత  
2
2/2

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement