ఆరు వికెట్ల తేడాతో నారాయణపేట విజయం
లీగ్ మ్యాచ్‌లో నా రాయణపేట జట్టు ఆరు వికెట్ల తేడాతో జోగులాంబ గద్వా ల జట్టు పై విజ యం సాధించింది. మొదట బ్యా టింగ్ చేసిన గద్వాల జ ట్టు 17.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో సుజాల్‌రెడ్డి 32 పరుగులు చేశారు. నారాయణపేట బౌలర్లు మహ్మద్ అఫ్పాన్ 4, భానుప్రసాద్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణపేట జట్టు 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అభిలాశ్‌గౌడ్ 34, అక్షయ్ 34 పరుగులు చేశారు. గద్వాల బౌలర్ అరవింద్ 2వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మహ్మద్ అఫ్పాన్ (నారాయణపేట) నిలిచాడు. మ్యాన్ ఆప్‌ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారులకు ఎండీసీఏ ప్రతినిధులు రూ.2వేల నగదుతోపాటు మెమోంటో అందజేశారు.


