బొటానికల్ గార్డెన్ ఓ అద్భుతం
● జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలభాస్కర్
జడ్చర్ల టౌన్: డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశా ల కు బొటానికల్ గార్డెన్ మకుటం లాంటిదని జా యింట్ డైరెక్టర్ బాలభాస్కర్ అన్నారు. సోమ వా రం ఆయన జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్‌ఆర్ రాజేందర్‌సింగ్‌తో కలసి కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బొటానికల్ గార్డెన్‌ను సందర్శించి మాట్లాడారు. ప్రతి అధ్యాపకుడు కళాశాల అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, డ్రాపౌట్ సంఖ్యను తగ్గించాలని, మెంటార్–మెంటిని అమలుచేయాలన్నారు. మరో డైరెక్టర్ రాజేందర్‌సింగ్ కళాశాలలో ఔషధ మొక్కలు నాటి అద్భుతమైన గార్డెన్ కలిగి ఉన్న ఈ కళాశాల తెలంగాణలోనే మొదటిదని గార్డెన్ ఓ అద్భుతమని కొనియాడారు. అనంతరం అధ్యాపకుడు రాఘవేందర్‌రెడ్డి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్‌సీసీ విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సుకన్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, నర్మద, అకాడమిక్ కో ఆర్డినేటర్ రాఘవేందర్‌రెడ్డి, గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య, కంట్రోలర్ సులేమాన్, మాధురి, పుష్పలత, సూరయ, జబిన్ పాల్గొన్నారు.


