కాంగ్రెస్ మండల అధ్యక్షుడిపై దాడి
● తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
కొత్తకోట రూరల్: పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో సోమవారం నూతన సర్పంచులు కొలువు దీరారు. ఈ క్రమంలో ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపిన వారిపై దాడికి పాల్పడిన ఘటన మండలంలోని నాటవెళ్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్‌కు చెందిన కొందరు యువకులు పార్టీ మండలాధ్యక్షుడు బీచుపల్లి యాదవ్‌కు కాంగ్రెస్, మీకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పలువురు మాట్లాడుతున్నారంటూ వారిని నివారించాలంటూ మొరపెట్టుకున్నా రు. స్పందించిన ఆయన కాంగ్రెస్ వ్యతిరేకుల తో మాట్లాడుతుండగా మాటా మాటా పెరగడంతో బీచుపల్లి యాదవ్‌తో పాటు నలుగురిపై వారు దాడి చేశారు. బీచుపల్లి యాదవ్‌కు తలకు తీవ్రగాయాలు కావడంతో కొత్తకోటలో ని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.


