మోసాలు చేసే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ క్రైం: బాధితుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా ఉండాలని, సకాలంలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లావ్యాప్తంగా 11 మంది బాధితులు హాజరై వినతులు అందించారు. ఆయా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి దరఖాస్తులపై వేగవంతంగా స్పందించాలన్నారు. ముఖ్యంగా భూవివాదాలు, కుటుంబ తగదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలన్నారు.
● కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ డి.జానకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


