మన్యంకొండలో వైభవంగా తిరుచ్చి సేవ
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చిసేవ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహంచారు. ఈ సందర్భంగా స్వామివారిని గర్బగుడి నుంచి శోభయమానంగా అలంకరించిన తిరుచ్చివాహనం పై దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిధ్యాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకవెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఈ సేవను తిలకించడానికి భక్తులు అధి క సంఖ్యలో మన్యంకొండకు తరలివచ్చా రు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మ ధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితోపాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.


