31న కురుమూర్తిస్వామి గిరి ప్రదక్షిణ
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురంలో వెలిసిన కురుమూర్తి స్వామి ఆలయం వద్ద ఈనెల 31 చేపట్టే గిరిప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి పిలుపునిచారు. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద నిర్వహించే గిరిప్రదక్షిణపై శనివారం విశ్వహింద్ పరిషత్, బజరంగ్‌దళ్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతిఒక్కరూ గిరిప్రదక్షిణలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వహిందూ, బజరంగ్‌దళ్ నాయకులు రాచర్లజనార్దన్, కురువ రమేశ్, చంద్రయ్య, కొట్టంశ్రీనివాస్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి, బొజ్జన్న, భూపాల్‌రెడ్డి, శివయ్య, చంద్రయ్య, శంకరయ్యతోపాటు పలువురు ఉన్నారు.
చోరీ కేసు ఛేదన
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని కేశవనగర్‌కాలనీలో ఈ నెల 8న జరిగిన చోరీ కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఊర్కొండపేట ఆలయ పూజారి శ్రీనివాస్‌శర్మ పట్టణంలోని కేశవనగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో 8వ తేదీన దొంగతనం జరగగా.. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించి ఎస్పీ, కల్వకుర్తి డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్‌ఐల బృందం అక్కడకు వెళ్లింది. ఈ నెల 17న ఉత్తరప్రదేశ్‌లోని కంద్లా పోలీసుల సాయంతో ఆపరేషన్ నిర్వహించి నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఉస్మాన్‌ను పట్టుకున్నారు. మిగతా వారిని పట్టుకునే క్రమంలో అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు సమయుద్దీన్ మృతిచెందగా.. షమ్మూలు తప్పించుకున్నాడు. నిందితుడి నుంచి రూ.3.02 లక్షలు, 25.4 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. నిందితుడిని కల్వకుర్తి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. నేర విచారణలో ప్రతిభ కనబర్చిన సీఐ నాగార్జున, ఎస్‌ఐ మాధవరెడ్డి, సీసీఎస్ అధికారి శంకర్, సిబ్బంది వెంకట్రాములు, చిరంజీవి, నజీర్, శ్రవణ్‌ను ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్‌తో పాటు డీఎస్పీ వెంకట్‌రెడ్డి అభినందించారు.
● ఉత్తరప్రదేశ్‌లో నిందితుడి పట్టివేత..
● పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన
మరో నిందితుడు, మరొకరు పరారీ
31న కురుమూర్తిస్వామి గిరి ప్రదక్షిణ
31న కురుమూర్తిస్వామి గిరి ప్రదక్షిణ


