రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: రోడ్డు ప్ర మాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని అల్లీపురంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ ఓబుల్‌రెడ్డి కథనం ప్రకా రం.. అడ్డాకుల మండలం ముత్యాలంపల్లికి చెందిన ఎండీ మహిమూద్( 31) శుక్రవారం తెల్లవారుజామున అత్తగారి ఊరైన ఆత్మకూర్ నుంచి ముత్యాలంపల్లికి వెళ్తుండగా.. అల్లిపురం సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. మహిమూద్ కు తీవ్రగాయాలు కాగా.. వెంటనే తన మిత్రు డు సంజీవయ్య ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించాడు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సంజీవయ్య ఫిర్యాదు మేరకు శనివారం కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మహిళ అదృశ్యం
తిమ్మాజిపేట: మహిళ అదృశ్యమైన ఘటన శనివారం మండలంలోని ఆవంచలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కర్నె సావిత్రమ్మ ఊర్కొండ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్నానని ఈ నెల 5న చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. సావిత్రమ్మ కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నేడు కవిత పర్యటన
గద్వాల: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు తెలంగాణ జాగృతి నాయకుడు గొంగళ్ల రంజిత్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాగృతి–జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లాకు వస్తున్నట్లు పేర్కొన్నారు.
పులి ఆనవాళ్లు కనిపిస్తే సమాచారం ఇవ్వండి
పెంట్లవెల్లి: గ్రామాల్లో అటవీ అధికారులు నిత్యం పర్యటిస్తుంటారని.. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కొల్లాపూర్ అటవీ అధికా రి కాశన్న తెలిపారు. రెండ్రోజుల కిందట ఎంగంపల్లితండాలో పెద్దపు లి జా డలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమై అడ విప్రాంత పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం మండలంలోని మల్లేశ్వ రం గ్రామంలో సిబ్బందితో కలిసి ఆయ న ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు భయభ్రాంతులకు గురికావద్దని, పొలాలు, గొర్రెలు, పశువుల మేపునకు వెళ్లే రైతులు, కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ముజీబ్, నర్సింహనాయుడు, కురుమయ్య పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి


