ఆవిష్కర్తలకు గొప్ప వేదిక టీజీఐసీ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నూతన ఆవిష్కర్తలకు టీజీఐసీ గొప్ప వేదికని.. సద్వినియో గం చేసుకోవాలని మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. శనివారం పుర పరిధిలోని ఎదిర ఐటీ టవర్‌లో శ్రీఇన్నోవేషన్ పంచాయత్‌శ్రీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రోటో టైపింగ్, మార్కెట్ యాక్సె స్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆవిష్కర్తలు, వ్యవస్థాపకుల ఇబ్బందులను తొలగించి విజయానికి కావాల్సిన సాంకేతిక వ్యూహాత్మాక సహకారం అందించడానికి టీజీఐసీ సిద్ధంగా ఉందన్నారు. ఇది ఒక గొప్ప అవకాశమని.. వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సందేహాలు నివృత్తి చేసుకొని తదుపరి కార్యాచరణపై స్పష్టత పొందాలని కోరారు. తెలంగాణ ఇన్నోవేషన్‌సెల్ సీఈఓ మెరాజ్ ఫహీమ్ మాట్లాడుతూ.. ఆవిష్కరణలు పెద్ద నగరాలకే పరిమితం కాదని మహబూబ్‌నగర్‌లో నేడు కనిపిస్తున్న ఉత్సాహం నిరూపిస్తోందన్నారు. శ్రీఇన్నోవేషన్ పంచాయత్‌శ్రీ ద్వారా మంచి ఆలోచనలు, ఆవిష్కరణలు ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభించేలా చూస్తున్నామని తెలిపారు. స్థానిక ఆవిష్కరణలు విజయవంతమైన వ్యాపారులుగా ఎదగడానికి అవసరమైన శిక్షణ, వనరులు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి 250 మందికిపైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, గ్రామీణ ఆవిష్కర్తలు పాల్గొన్నారు.


