
పింఛన్లు పెంచలేకపోతే రాజీనామా చెయ్
జడ్చర్ల టౌన్: వికలాంగులకు పింఛన్ రూ.6వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అన్నిరకాల చేయూత పింఛన్లు రూ.4వేలకు పెంచాలని, అలా పెంచటం చేతకాకపోత రాజీనామా చేయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని సాలెహ ఫంక్షన్‌హాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పింఛన్‌దారుల ఆధ్వర్యంలో నిర్వహించిన జడ్చర్ల నియోజకవర్గ సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పింఛన్‌లు పెంచి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారన్నారు. పింఛన్లు పెంచటం చేతకాకుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంటర్ 9న హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో లక్షలాదిమందితో మహాగర్జన నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు బీకే నర్సింహ, ప్రధాన కార్యదర్శి నరేందర్, వీహెచ్‌పీఎస్ మండల అధ్యక్షుడు గడ్డం యాదయ్య, సావిత్రి రంగా, వీహెచ్‌పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, తిరుపతమ్మ, చిన్న అంజయ్య, జంగయ్య, రాములు, గోపాల్, పద్మ, రఫిక్‌లు ఉన్నారు.