
బ్యాలెట్ బాక్సులు సిద్ధం..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా ఈవీఎంలతో కాకుండా పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ ఓటింగ్ విధానంతో నిర్వహించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 3,200 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 20శాతం బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచనున్నారు. వీటిని ఏపీలోని చిత్తూర్, సింధనూర్ నుంచి తెప్పించారు. గత ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన బ్యాలెట్ బాక్సులను వినియోగించారు.
● గతంలో మాదిరిగానే ఈ సారి కూడా జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 423 పంచాయతీల్లో స్థానిక పరిస్థితులు, శాంతి భద్రతలు, ఎన్నికల సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.