
సాఫ్ట్‌బాల్‌లో కిరణ్‌కుమార్ సత్తా
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామానికి చెందిన జక్కా కిరణ్‌కుమార్ సాఫ్ట్‌బాల్‌లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. కిరణ్‌కుమార్ గత 11 ఏళ్ల నుంచి రాణిస్తున్నాడు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. జిల్లా జట్టుకు పలు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వివిధ విభాగాల పోటీల్లో ఇప్పటివరకు నాలుగుసార్లు బంగారు, రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాడు. కిరణ్‌కుమార్ దాదాపు 20 సార్లు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నాడు. 2016 సంవత్సరంలో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం దుర్గ్‌లో జరిగిన జాతీయస్థాయి నేషనల్, 2017లో హైదరాబాద్, చత్తీస్‌ఘడ్ దుర్గ్, 2018 గుజరాత్‌లో జరిగిన జూనియర్ నేషనల్, 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్‌లో జరిగిన జాతీయ సీనియర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూర్‌లో జరిగిన సీనియర్ సౌత్ జోన్ సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2023 సంవత్సరంలో జమ్ముకాశ్మీర్ (జమ్ము)లో జరిగిన సీనియర్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తమిళనాడు రాష్ట్రం సేలంలో జరిగిన ఆలిండియా ఇంటర్ జోనల్ నేషనల్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించాడు.
బ్యాంకాక్ టోర్నీలో భారతజట్టుకు ప్రాతినిధ్యం
థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్‌లో ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి 5 వరకు జరిగిన 2వ అండర్–23 పురుషుల సాఫ్ట్‌బాల్ ఏషియా కప్ 2025లో కిరణ్‌కుమార్ భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఏషియా కప్‌లో కిరణ్‌కుమార్ ఐదు మ్యాచులకుగాను హంకాంగ్–చైనా, సింగపూర్, థాయిలాండ్ జట్లతో భారత జట్టు తరపున ఆడాడు. ఒలింపిక్స్‌లో దేశం తరపున ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిరణ్‌కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.