
బీచ్ హ్యాండ్‌బాల్‌లో బెస్ట్ అటాకర్ ఆసిఫుల్లాబేగ్..
భూత్పూర్ మండలం తాటికొండకు చెందిన ఆసిఫుల్లాబేగ్ హ్యాండ్‌బాల్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. అటాకర్‌గా ఆడుతున్న ఆసిఫుల్లాబేగ్ ఇప్పటివరకు 35 రాష్ట్రస్థాయి, 5 జాతీయస్థాయి టోర్నీల్లో పాల్గొని ప్రతిభచాటాడు. ముఖ్యంగా బీచ్ హ్యాండ్‌బాల్‌లో రాణిస్తున్న ఆసిఫుల్లా న్యూఢిల్లీలో జరిగిన భారత బీచ్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. ఏప్రిల్ 21 నుంచి 30 వరకు న్యూఢిల్లీలో జరిగిన భారత హ్యాండ్‌బాల్ జట్టు శిక్షణ శిబిరంలో పాల్గొన్న 15 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు కాగా వారిలో ఆసిఫుల్లా ఒకరు. మే 6 నుంచి 15 వరకు ఒమన్ దేశం మస్కట్‌లో జరిగిన ఏషియనల్ బీచ్ హ్యాండ్‌బాల్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భవిష్యత్తులో క్రీడాకోటాలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆసిఫుల్లాబేగ్ పేర్కొన్నాడు.