
ఖమ్మంపై మహబూబ్‌నగర్ భారీ విజయం
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని కేసీఆర్–2 మైదానంలో మంగళవారం జరిగిన బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 218 పరుగుల తేడాతో ఖమ్మం జట్టుపై విజయం సాధించింది. మొదటి రోజు మహబూబ్‌నగర్ జట్టు 87.1 ఓవర్లలో 331 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు జిల్లా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 35.2 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా బౌలర్లు ఎండీ ముఖితుద్దీన్ 8.2 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, శశాంక్ 9 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. భవిష్యత్‌లో ఇదేవిధంగా సమష్టిగా ఆడి మరిన్ని విజయాలు నమోదు చేయాలని ఆకాంక్షించారు.