వీడిన సస్పెన్స్‌..! లోక్‌సభ అభ్యర్థిగా డీకే అరుణ.. | - | Sakshi
Sakshi News home page

వీడిన సస్పెన్స్‌..! లోక్‌సభ అభ్యర్థిగా డీకే అరుణ..

Mar 14 2024 1:00 AM | Updated on Mar 14 2024 12:13 PM

- - Sakshi

2వ జాబితాలో ప్రకటించినఆ పార్టీ అధిష్టానం

పాలమూరులో ఈసారి కూడా త్రిముఖ పోరే..

ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ నుంచిభరత్‌కు అవకాశం

అక్కడ కాంగ్రెస్‌ టికెట్‌ పెండింగ్‌.. మల్లురవి, సంపత్‌ మధ్య పోటాపోటీ

బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తులో భాగంగా ఆర్‌ఎస్పీకి అవకాశం

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్‌ వీడింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ఖరారైంది.

ఈ లోక్‌సభకు సంబంధించి డీకే అరుణతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ మధ్య టికెట్‌ పోరు కొనసాగడంతో అధిష్టానం పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం రెండో జాబితాను ప్రకటించగా.. మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణకు చోటు దక్కింది. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌ ప్రసాద్‌ పేరును తొలి జాబితాలోనే ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారుకావడంతో ప్రచారం జోరందుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇవి చదవండి: 'బీజేపీ టికెట్‌' నగేశ్‌కే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement