పడిపోతున్న వేరుశనగ ధరలు | - | Sakshi
Sakshi News home page

పడిపోతున్న వేరుశనగ ధరలు

Feb 4 2026 7:34 AM | Updated on Feb 4 2026 7:34 AM

పడిపోతున్న వేరుశనగ ధరలు

పడిపోతున్న వేరుశనగ ధరలు

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో పల్లి ఽ(వేరుశనగ) ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఇటీవల పది రోజుల క్రితం క్వింటా వేరుశనగ ధర దాదాపు రూ.13 వేల చేరువలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. రోజు జుకు వేరుశనగ ధరలు పడిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మార్కెట్‌కు 4,244 క్వింటాళ్ల వేరుశనగ రాగా క్వింటాకు గరిష్టంగా రూ.9,535, కనిష్టంగా రూ.5,400 ధరలు లభించాయి. అలాగే ధాన్యం హంస రూ.1,729, ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.1,771, కనిష్టంగా రూ.1,761, కందులు గరిష్టంగా రూ.8,001, కనిష్టంగా రూ.5,039, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,961, కనిష్టంగా రూ.1,678, మినుములు గరిష్టంగా రూ.8,466, కనిష్టంగా రూ.4,610 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు క్వింటా గరిష్టంగా రూ.7,829, కనిష్టంగా రూ.7,719గా ధరలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement