అండర్‌ స్టాండింగ్‌ పాలి‘ట్రిక్స్‌’ | - | Sakshi
Sakshi News home page

అండర్‌ స్టాండింగ్‌ పాలి‘ట్రిక్స్‌’

Feb 4 2026 7:34 AM | Updated on Feb 4 2026 7:34 AM

అండర్‌ స్టాండింగ్‌ పాలి‘ట్రిక్స్‌’

అండర్‌ స్టాండింగ్‌ పాలి‘ట్రిక్స్‌’

అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ

బీఆర్‌ఎస్‌ 2, బీజేపీ 8 డివిజన్లలో పోటీకి దూరం

పాలమూరు: కార్పొరేషన్‌లో ఉన్న 60 డివిజన్‌లలో అధికార పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంటే మిగిలిన ప్రధాన పార్టీలు కొన్నిచోట్ల అభ్యర్థులను బరిలో ఉంచలేదు. రెండు డివిజన్లలో బీఆర్‌ఎస్‌, ఎనిమిది డివిజన్లలో బీజేపీకి పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీ చేయడం లేదు.

● కొన్ని డివిజన్‌లలో తమ పార్టీలకు సంబంధించిన బలమైన అభ్యర్థులను గెలిపించుకోవడానికి అంతర్గతంగా ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ ప్రధాన పార్టీకి చెందిన కీలక నేత ఒకరు నగరంలో చాలా డివిజన్‌లలో చక్రం తిప్పుతూ వాళ్లకు మరింత దగ్గరగా ఉన్న కార్పొరేట్‌ అభ్యర్థుల గెలుపు కోసం ఇతర పార్టీ పెద్ద నేతలతో చర్చించి ఆయా స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను బరిలో ఉండేలా ఇరు పార్టీలను ఒప్పించినట్లు సమాచారం. మూడు ప్రధాన పార్టీలతో పాటు మరో చోట పార్టీకి చెందిన నేతలు పూర్తిగా అండర్‌ స్టాండింగ్‌తో ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

రెబెల్స్‌ బెడద

అధికార కాంగ్రెస్‌ పార్టీలో దాదాపు 50 డివిజన్‌లలో రెబల్స్‌ బెడద కన్పిస్తోంది. కొన్ని డివిజన్‌లలో మాజీ కౌన్సిలర్లు.. ఉండగా మరికొన్ని చోట్ల పార్టీలో దీర్ఘకాలంగా ఉంటూ పార్టీకి సేవలు చేసిన నేతలు ఉన్నారు. కొన్ని డివిజన్‌లలో కొత్తగా పార్టీలోకి వచ్చి టికెట్‌ కోసం తీవ్రంగా శ్రమించిన యువకులు సైతం రెబల్స్‌గా పోటీలో ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement