
మహబూబ్‌నగర్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల పోరుకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్‌లో చేరికలు చిచ్చురేపుతున్నాయి. కీలక నేతల చేరికలతో పార్టీని బలోపేతం చేసే దిశగా పెద్దలు అడుగులు వేయగా.. ఉమ్మడి పాలమూరులో పాత, కొత్త నాయకుల మధ్య పంచాయితీకి ఆజ్యం పోసింది. అభ్యర్థిత్వాలపై ఎవరికి వారు పట్టు కొనసాగిస్తుండగా.. అసమ్మతి రాజుకుంటోంది.
పలు నియోజకవర్గాల్లో ఇరువర్గాల నేతల అనుచరులు పరస్పర విమర్శలకు దిగుతుండడం రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరికి వారు ఆధిపత్యంకోసం ప్రయత్నిస్తుండడం పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. సర్వేఫలితాలే ఫైనల్ అంటూ అధిష్టానం మిన్నకుండిపోవడంపై హస్తం శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.