గార్ల: ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించాలని, విధుల్లో సమయపాలన పాటించాలని డీసీహెచ్ఎస్ రమేశ్ ఆదేశించారు. శుక్రవారం గార్ల సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత వైద్యులు, వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం వైద్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలన్నారు. ప్రతీరోజు ఒక వైద్యుడు నైట్ డ్యూటీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి వార్డులను పరిశీలించి, వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గర్భిణుల డెలివరీల సంఖ్య పెంచేలా కృషి చేయాలని కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, వైద్యులు బాలు నాయక్, ప్రియాంక, వైశాలి, ప్రదీప్‌కుమార్, కృష్ణవేణి, హెడ్ స్టాఫ్నర్సింగ్ ఆఫీసర్ స్వాతి ఉన్నారు.


