సైన్స్‌ పండుగకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ పండుగకు వేళాయె!

Nov 21 2026 2:38 AM | Updated on Nov 21 2026 2:38 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు సైన్స్‌ పండుగ జరగనుంది. నేటినుంచి మానుకోట మున్సిపాలిటీ పరిధి అనంతారం మోడల్‌ స్కూల్‌లో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌, పీఎంశ్రీ పాఠశాల సైన్స్‌ ఎగ్జిబిట్లు, సైన్స్‌ఫెయిర్‌ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అదనపు కలెక్టర్‌, డీఈఓ అని ల్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖ సైన్స్‌అధికారి అప్పారావు, ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కాగా, శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు.

377 ప్రదర్శనలు..

ఈసారి జిల్లాలో 22పీఎంశ్రీ పాఠశాలల నుంచి 44 ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. తెలంగాణ ఫ్యూచర్‌ ఇన్నోవేటర్స్‌ ఛాలెంజ్‌ (టీప్‌ఐసీ–1.0)లో 30 ప్రాజెక్ట్‌లు పాల్గొంటాయి. అలాగే జిల్లాస్థాయి సైన్స్‌ ఫెయిర్‌, ఇన్‌స్పైర్‌ రెండు రకాల పోటీల్లో జిల్లాస్థాయి ప్రదర్శనలు జరగనున్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చెందిన 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు పోటీ పడనున్నారు. ఇప్పటికే సైన్స్‌ఫెయిర్‌ పోటీలకు ఎంపికై న విద్యార్థుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జమయ్యాయి. మొత్తంగా 377ప్రదర్శనలకు గానూ ప్రతిభ ఆధారంగా 10శాతం మేరకు రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటితే జాతీయ స్థాయి, అనంతరం రాష్ట్రపతి భవన్‌ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయి ప్రదర్శనలకు ఎంపికై న విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత సాంకేతికశాస్త్ర సంస్థల్లో నిర్దేశిత సైన్స్‌ కోర్సుల్లో చేరడానికి రిజర్వేషన్‌ అమలవుతుంది. అలాగే జపాన్‌కు చెందిన సకూర సంస్థ భాగస్వామ్యంతో పేటెంట్‌ హక్కులు కల్పిస్తారు. అవసరం మేరకు ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

నేటి నుంచి మూడు రోజుల పాటు ఇన్‌స్పైర్‌, సైన్స్‌ఫెయిర్‌

మొత్తం 377 ప్రదర్శనలు

అనంతారం మోడల్‌ స్కూల్‌లో ఏర్పాట్లు పూర్తి

16 కమిటీలు

సైన్స్‌ఫెయిర్‌..

మొత్తం వచ్చిన,

ఎంపికై న

దరఖాస్తులు

263

విద్యార్థుల

గైడ్‌ టీచర్లు

263

ఇన్‌స్పైర్‌ వివరాలు

మొత్తం దరఖాస్తులు సుమారు 1200

ఎంపికై న ప్రదర్శనలు 72

విద్యార్థుల ఖాతాల్లో రూ.7.20లక్షలు జమ

గైడ్‌ టీచర్లు

72మంది

ఇన్‌స్పైర్‌, సైన్స్‌ఫెయిర్‌ ప్రదర్శనల నిర్వహణకు 16 కమిటీలు ఏర్పాటు చేశారు. ఎంఈఓలు కన్వీనర్లుగా, ప్రధానోపాధ్యాయులు కోకన్వీనర్లుగా, ఉపాధ్యాయులు సభ్యులుగా వ్యవహరి స్తారు. సుమారు 120మంది భాగస్వాములు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement