ఫోరెన్సిక్‌ సైన్స్‌కు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్‌ సైన్స్‌కు ప్రాధాన్యం

Nov 21 2026 2:38 AM | Updated on Nov 21 2026 2:38 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : నేర న్యాయ వ్యవస్థలోను, న్యాయవాదుల వృత్తి నిర్వహణలోనూ ఫోరెన్సిక్‌ సైన్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రాముఖ్యత, నేర న్యాయ వ్యవస్థలో దాని ఉపయోగాలు అనే అంశంపై జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఫోరెన్సిక్‌ సైన్స్‌పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రోబ్‌ ల్యాబ్‌ ఫోరెన్సిక్‌ సంస్థ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రోబ్‌ ల్యాబ్‌ ఫోరెన్సిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన్‌ ఎర్రగొల్ల మాట్లాడుతూ.. వివాదాస్పద సంతకాలు, నకిలీ పత్రాలు, వేలిముద్రలు, డిజిటల్‌ ఆధారాల శాసీ్త్రయ పరిశీలన గురించి సోదాహరణంగా వివరించారు. కేసుల విచారణలో ఏ అంశాలకు నిపుణుల పరిశీలన అవసరమో గుర్తించడానికి ఈ పరిజ్ఞానం దోహదపడుతుందని తెలిపారు. ఫోరెన్సిక్‌ నిపుణుల నివేదికలను సమగ్రంగా అర్థం చేసుకుని కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించడానికి ఈ పరిజ్ఞానం న్యాయవాదులకు ఎంతగానో తోడ్పడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి సిద్ధార్థ, న్యాయవాదులు వెంకటేశ్వర్లు, చలపతిరావు, కేశవరావు, దాసరి నాగేశ్వరరావు, గిరి, కమల్‌, సురేశ్‌రెడ్డి, మల్లారెడ్డి, తుంపిల్ల శ్రీనివాస్‌, బట్టు కృష్ణ, చిలుకమారి వెంకటేశ్వర్లు, దర్శనం రామకృష్ణ, బానోత్‌ బాలాజీ నాయక్‌, రాజమణి, సునీత, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement