మహబూబాబాద్: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని, టాలెంట్ టెస్ట్‌తో పాటు, వ్యాసరచన తదితర పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రతిభ చాటాలని డీపీఆర్వో పసునూరి రాజేంద్రప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని డీపీఆర్వో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో సరైన దారిచూపేది పుస్తకాలు అనే విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలన్నారు. మానవుడి మేధో వికాసానికి పుస్తకమే పునాదన్నారు. పుస్తక పఠన సంస్కృతి పెరిగితే విజ్ఞాన సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి పుస్తకానికి మాత్రమే ఉందన్నారు. చదువును మించిన ఆస్తి లేదని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో లైబ్రేరియన్లు విజేందర్, రుద్రారపు వీరేందర్, సిబ్బంది భూలక్ష్మి, యాదమ్మ, గ్రంథాలయ పాఠకులు హరి లాల్, విజ్ఞాన్, అనూప్, సూరజ్, మౌనిక, కవిత, సరిత, తదితరులు పాల్గొన్నారు.
ఐఆర్‌సీఎస్ పాలక మండలి సభ్యుడిగా రవి చందర్‌రెడ్డి
మహబూబాబాద్: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో శనివారం రాత్రి రెడ్‌క్రాస్ సొసైటీ పాలక మండలి సభ్యుడిగా మానుకోటకు చెందిన రావుల రవిచందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఐఆర్‌సీఎస్ మానుకోట శాఖ బాధ్యులు పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ఐఆర్‌సీఎస్ జిల్లా చైర్మన్ మాధవపెద్ది వెంకట్‌రెడ్డి, ఐఆర్‌సీఎస్ మానుకోటశాఖ భాద్యులు పాల్గొన్నారు.
గెజిటెడ్ హెచ్‌ఎంల
సంఘం జిల్లా అధ్యక్షుడిగా లచ్చిరాంనాయక్
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సంఘం కౌన్సిల్ సమావేశంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాంనాయక్‌ను ఏకగ్రీవంగా ఎనుకున్నట్లు రాష్ట్ర అసోసియేషట్ అధ్యక్షుడు మందుల శ్రీరాములు ఆదివారం తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా అనితాదేవి, కోశాధికారిగా కనకయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నరేందర్, శ్రీదేవి ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు ఇస్లావత్ లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన జిల్లా ప్రధానోపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
పెండింగ్ బకాయిలు
చెల్లించాలి
మహబూబాబాద్ అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ఆదివారం టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు మేకల కుమార్ అధ్యక్షతన మండలశాఖ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ.. హెల్త్‌కార్డులు అన్ని యాజమాన్య గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులకు అమలు చేయాలన్నారు. బీసీ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్, జిల్లా కార్యదర్శులు బానోతు హరినాయక్, హుస్సేన్, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సాభాగ్య, శ్రీనివాస్, రాంజీ, నాయకులు శ్రీనివాస్, ప్రసాద్, వెంకట్‌నారాయణ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
అనితాదేవి,
ప్రధానకార్యదర్శి
లచ్చిరాంనాయక్, అధ్యక్షుడు


