● ఆర్టీసీ ప్రత్యేక బస్సు యాత్రపై
విస్తృత ప్రచారం
● శబరిమల, టూరిస్టు ప్రాంతాలు,
పెళ్లిళ్లు, శుభకార్యాలకు సర్వీసులు
నెహ్రూసెంటర్: ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఆర్టీసీ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. పుణ్యక్షేత్రాల సందర్శన, విహార యాత్ర, ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిపో నుంచి ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను కవర్ చేసేలా యాత్ర బస్సులను ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు శుభకార్యాలు, పెళ్లిళ్లకు బస్సులను అద్దె ప్రాతిపదికన నడు తుపుతున్నారు. విహారయాత్ర బస్సులపై విస్తృత ప్రచారం చేస్తూ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులను సురక్షితంగా యాత్రలకు తీసుకెళ్తున్నారు.
మానుకోట డిపో నుంచి..
విజయవాడ, బాపట్ల బీచ్, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, శబరిమల యాత్రలకు మహబూబాబాద్ డిపో ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. విహార యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఆర్టీసీ డీలక్స్ బస్సులను నడిపిస్తున్నారు. ప్రత్యేక బస్సుల వివరాల కోసం 99592 26054, 91216 04919, 99482 14022 నంబర్లు లేదా ఆర్టీసీ డిపోలో సంప్రదించి వివరాలను తెలసుకోవచ్చు.
శబరిమల యాత్రకు..
అయ్యప్పస్వామి మాలధారుల శబరిమల యాత్ర కు మహబూబాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. అయ్యప్పస్వామి మాలధారణ ప్రారంభమైన నేపథ్యంలో ప్రచా రం చేస్తూ శబరిమలకు బస్సులను పంపిస్తున్నారు. శబరిమలకు వెళ్లే బస్సుల్లో గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఇద్దరు వంట మనుషులకు, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు సీ ట్లు లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. యా త్రలో మాలధారులకు అనుకూలంగా విశ్రాంతి, భో జన విరామం కల్పించడంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలు సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
అరుణాచలం యాత్ర..
మహబూబాబాద్ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు బస్సు సౌకర్యం ఉంది. కాణిపాకం–వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది. ఆర్టీసీ డిపో నుంచి సూపర్‌లగ్జరీ బస్సు ఈ నెల 22న(ఆదివారం) రాత్రి 8గంటలకు బయల్దేరుతుంది. తిరిగి 25న డిపోకు చేరుకుంటుంది. ఈ యాత్రలో పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.3 వేలు చార్జీలుగా నిర్ణయించారు.
సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ డిపో నుంచి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలతో ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. యాత్రికులు, భక్తులు, అయ్యప్పమాలధారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సురక్షిత ప్రయాణం అందించడం, యాత్రలతో పాటు భక్తులకు అనుకూలమైన ప్రదేశాలకు బస్సులను అద్దెకు ఇస్తున్నాం.
–కల్యాణి, డిపో మేనేజర్


