కేదారి కుటుంబానికి మంత్రి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

కేదారి కుటుంబానికి మంత్రి పరామర్శ

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

హన్మకొండ: ఇటీవల అగ్నిప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి దంపతుల కుటుంబాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డితో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పరామర్శించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే నాయిని కోరిక మేరకు మంత్రి పొంగులేటి.. లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించారు. ఉద్యమ కాలంలో కేదారి అందించిన సేవలను ఎమ్మెల్యే నాయిని.. మంత్రికి వివరించి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరారు. స్పందించిన మంత్రి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు.

20న ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌

హసన్‌పర్తి: ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థుల కోసం ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌కు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ సహకారంతో పోలీస్‌ ఉద్యోగానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ అందించేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని వ రంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు httpscœ/form,gle/eD2e5jNfebo5prg8 వెబ్‌సైట్‌లోవివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆదివారం (ఈనె20న) ఉద యం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్న ట్లు చెప్పారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాల, హనుమకొండలోని ఎస్‌వీఎస్‌ కళాశాల, జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్‌ కళాశాల, పరకాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నర్సంపేటలోని బిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గంజాయి రవాణా కేసులో నేరస్తుడికి పదేళ్ల జైలు

జనగామ రూరల్‌: గంజాయి రవాణా కేసులో నేరం రుజువు కావడంతో నేరస్తుడికి పదేళ్ల కఠి న కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ గురువారం తీర్పు వెలువరించారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఆఫీసర్‌ (ఈ ఎస్‌) అంజిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. జనగామ ఎకై ్సజ్‌ స్టేషన్‌ అప్పటి ఎస్సై సీహెచ్‌.జనార్దన్‌ 2023, అక్టోబర్‌ 30వ తేదీన రాత్రి సమయంలో పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో ఓ బెంచ్‌పై కూర్చుని అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో బిహార్‌కు చెందిన శంకర్‌ కుమార్‌ యాదవ్‌ వరంగల్‌ నుంచి ముంబా యికి 10 కిలోల ఎండు గంజాయి రవాణా చే స్తున్నట్లు నేరం ఒప్పుకున్నాడు. దీంతో జనగా మ ఎకై ్సజ్‌ పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్‌ చేశారు. అనంతరం కేసు జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. కోర్టు లైజన్‌ ఆఫీసర్లు రమేశ్‌, శోభారాణి సమన్వయంతో కోర్టు కానిస్టేబుల్‌ సింధూజ సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టారు. జిల్లా కోర్టు పీపీ కాచరాజు హరి చంద్ర ప్రసాద్‌ కేసు వాదించి నేరస్తుడికి శిక్ష పడేలా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement