విద్యుత్‌ బిల్లుల చెల్లింపు సులభతరం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల చెల్లింపు సులభతరం

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

నెహ్రూసెంటర్‌: విద్యుత్‌ వినియోగదారులు తమ బిల్లులను సులభంగా, వేగవంతంగా చెల్లించేందుకు విద్యుత్‌శాఖ డిజిటల్‌ చెల్లింపు విధానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని మహబూబాబాద్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ దర్శన్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఇంటి వద్ద నుంచే తమ విద్యుత్‌ బిల్లులు చెల్లించుకోవచ్చని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో వివిధ యాప్‌ల ద్వారా బిల్లులను చెల్లించుకోవచ్చన్నారు. అందుబాటులో ఉన్న డిజిటల్‌ సౌకర్యాలను వినియోగించుకుని సురక్షితంగా, సులభతరంగా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరారు.

కేజీబీవీ టీచర్‌కు షోకాజ్‌ నోటీసు

కురవి: మండలంలోని నేరడ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు చెందిన టీచర్‌ సుహాసినికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు జీసీ ఈఓ గాయత్రి శుక్రవారం తెలిపారు. పాఠశాలలో వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా పిల్లలను కొట్టారనే ఆరోపణ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ డీఈఓ ఆదేశాల మేరకు షోకాజ్‌ నోటీసులు అందించినట్లు ఆమె తెలిపారు.

హనుమకొండ కోర్టుకు ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌

మరిపెడ రూరల్‌: ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్‌ శుక్రవారం హనుమకొండలోని కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో నమోదైన కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియలో భాగంగా ఆయన కోర్టుకు హాజరైనట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువు రు న్యాయవాదులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఉద్యోగ మేళాకు స్పందన

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు జిల్లా నుంచి 65 మంది అభ్యర్థులు హాజరు కాగా.. ఇంటర్వ్యూ లు, స్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి 35మందిని ఎంపిక చేసినట్లు కళాశాల కరస్పాండెంట్‌ డోలి సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థులకు ఐసీసీఐ బ్యాంక్‌ నియామక పత్రాల ఉత్తర్వులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఐసీసీఐ బ్యాంక్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ సుబ్రియా, కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌, ఉద్యోగ మేళా మేనేజర్‌ గణేష్‌, అభ్యర్థులు పాల్గొన్నారు.

పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలి

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో జీఓ 58కింద 50నుంచి 70గజాల స్థలాల్లో నిరుపేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే మురళీనాయక్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో గతంలో జీఓ 58 కింద నిరుపేదలు చిన్నచిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారని, వారి ఇళ్లను రెగ్యులరైజ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్‌ పట్టణానికి 1,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మున్సిపాలిటీ పరిధిలో పేదలు ఇళ్ల నిర్మాణాని కి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎ మ్మెల్యే సభ దృష్టికి తీసుకెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగించా లన్నారు. అసంపూర్తి పంచాయతీ భవనాల కు అదనపు నిధులు మంజూరు చేయాలన్నా రు.

‘చట్టాలు అమలు చేయకపోతే ఉద్యమం’

బయ్యారం: ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలను అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్‌ అన్నారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 21న తలపెట్టిన భద్రాచలం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని శుక్రవారం మండలంలోని పలు ఆదివాసీ పల్లెల్లో పోస్టర్‌ ఆవిష్కరణ, సమావేశాలు నిర్వహించారు. బయ్యారంలోని కొమురం భీం విగ్రహం వద్ద ఇటీవల హత్యకు గురైన ఊకే శిరీష మృతికి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. తుడుందెబ్బ నాయకులు పోలబోయిన వెంకటేశ్వర్లు, ఇల్లందు ఏఎంసీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మొట్లతిమ్మాపురం సర్పంచ్‌ సాంబయ్య, బయ్యారం మాజీ సర్పంచ్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement